ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26 నుండి అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిజమైన లబ్ధిదారు లందరికీ అందేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. తహారా పూర్(మాందారిపేట) గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26 నుండి ఈ నాలుగు పథకాలను ప్రారంభించను న్నదని, పథకాల అమలులో భాగంగా ఈరోజు నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో గ్రామస్తులను, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు. కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమని కార్యక్రమం అని, ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు..రాబోయే నాలు గేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, అన్ని గ్రామాల ప్రధాన కాంగ్రెస్ కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు