జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వసంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశమనిప్రజలు,గ్రామ సభలను
సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి తాడిపర్తి గ్రామ సభలో ప్రజలను కోరారు
గోపాల్ పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామంలో జరిగిన గ్రామ సభకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, జల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఉద్దేశ్యంతో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో అర్హులైన వారి జాబితా రూపొందించడం జరిగిందన్నారు.ఈ జాబితాలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు, అభ్యంతరాలు ఉన్నాయా అనేది ప్రజల సమక్షంలో పెట్టీ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకురావడం జరుగుతుందన్నారు.అనర్హులు ఉంటేవారిని తొలగించడం జరుగుతుంది అన్నారు.గ్రామంలో సాగు యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించడం జరుగుతుందని, అలాంటివి ఏవైనా ఉంటే గ్రామసభలో తెలియజేయాలని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో కానీ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పథకాల అమలు విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు గ్రామ సభలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపిడివో, అధికారులు, ప్రజలు, పాల్గొన్నారు.