Water supply to be cut off for two days
రెండు రోజులు నీటి సరఫరా బంద్
వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.
మెదక్: వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పెద్దరెడ్డిపేట వద్ద పైప్లైన్ లీకేజీ మరమ్మతులు, రాయిపహాడ్ వద్ద స్లూయి్సవాల్స్ రిపేర్లు, సివిల్ పనులు, సంపులు శుభ్రపరచడం తదితర నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తిచేయడం కోసం సింగూరు(Singoor) నుంచి జిల్లాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.
