Villagers Protest Cemetery Encroachment
శ్మశానవాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన, ట్రాక్టర్ స్వాధీనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం రుకుమాపూర్ గ్రామంలో పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు రావడంతో జహీరాబాద్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అతర్ అహ్మద్ అక్కడికి తమ నాయకులతో చేరుకొని మరియు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పత్రికేయులతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తమ భూమికి మార్గం చేసుకునేందుకు శ్మశానవాటిక భాగాన్ని కూల్చివేసి ఆక్రమించేందుకు ప్రయత్నించారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రభు తెలిపారు. స్థానిక ముస్లిం ప్రతినిధులు, గ్రామస్తులు భూమిని రక్షించి, బాధ్యులపై కఠిన మైన అధికారిక చర్యలు తీసుకోవాలని కోరారు.
