తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పై అధికారుల ఆదేశానుసారం మండల కేంద్రంలో వాహనాల అతనికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను తీసుకువచ్చి వాహనాలకు ఆన్లైన్ పెనాల్టీ వేయడంతో పాటు నెంబర్ ప్లేట్లు తీసుకోవాల్సిందిగా కోరుతూ తీసుకొచ్చిన వారికి పెనాల్టీ వేస్తూ వారి వాహనాలను వాహనదారులకు ఇవ్వడం జరిగింది అలాగే వాహనదారులుకు పలు సూచన చేస్తూ వాహనంపై తిరిగేవారు వాటిని సంబంధించిన కాగితాలు అన్ని సక్రమంగా ఉంచుకుంటూ వాహనాలకు సంబంధించిన అధికారులు అడిగినచో అన్ని చూపించాలని అలాగే వాహదారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి తనిఖీల కార్యక్రమంలో స్థానిక ఎస్సై రామ్మోహన్ ఏఎస్ఐ చంద్రమౌళి కానిస్టేబుల్ నరేందర్ మహిళా కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు