గీతా జయంతి సందర్భంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున హనంకొండ నక్కల గుట్టలోని ఎస్ఎంఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన భగవద్గీత శ్లోకాల పోటీలను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ప్రముఖ యోగ గురువు పోశాల. శ్రీనివాస్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీత ప్రపంచ మానవాళి అనుసరించినట్లయితే మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందని తద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకి భగవద్గీత శ్లోకాలను నేర్పించడం ద్వారా ఉన్నతంగా ఎదుగుతారని, నవ సమాజ నిర్మాణానికి అది దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కోఆర్డినేటర్ రామిరెడ్డి కృష్ణమూర్తి, SMR స్కూల్ చైర్మన్ ముక్తేశ్వర్, నాగిళ్ల. వేణు శర్మ, తండ. అశోక్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.