చిట్యాల, నేటి దాత్రి :
శనివారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏ వై ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రపు రాజేందర్ అద్యక్షతన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ద మతం* స్వీకరించిన రోజును పురస్కరించుకోని గౌతమా బుద్దుడి చిత్ర పటానికి, అంబేద్కర విగ్రహానికి పూలమాలలు రాష్ట్ర ప్రచార కార్యాదర్శి పుల్ల మల్లయ్య* వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని దేశంలో అన్ని మతాల గురించి తెలుసుకున్నాడని తెలిపారు. మన భారత దేశంలోని ఆన్ని మతాల సారాంశం ఒక్కటే అని చివరకు గౌతమా బుద్దుని బోధనలు సిద్దాంతాలు నచ్చి 14 అక్టోబర్ 1956 న* లక్షలాది మంది ప్రజల సమక్షంలో బౌద్ద మతాన్ని స్వీకరించాడని అన్నారు.. ఆ మహానీయుడు బౌద్ద మతం స్వీకరించి నేటి తో 67 సఁవత్సరాలు దాటుతుందన్నారు. యువతి, యువకులతో పాటు ప్రతి ఒక్కరూ బుద్దుడి బోధనలు, మరియు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించుటకు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే.యుగేందర్, ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కోండ. సురేష్ మండల నాయకులు సరిగొమ్మల రాజేందర్, గుర్రం రాజమొగిళి, కట్కూరి శ్రీనివాస్ , గుర్రం. తిరుపతి రాజేందర్, తిరుపతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.