నల్లబెల్లి మండలంలో పెద్దపులి సంచారం.

# రుద్రగూడెం గ్రామంలో పులి అడుగులు హల్చల్..
# భయాందోళనలో నల్లబెల్లి,నర్సంపేట మండలాల ప్రజలు.

#ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఫారెస్ట్,పోలీస్ శాఖల అధికారులు.

# అవి పులి అడుగులలే… నిర్ధారించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికిరణ్..
# మూడుచెక్కలపల్లె నుండి విడిపోయిన పెద్ద పులులు.

# ఆడపులి, పులిపిల్ల కొత్తగూడ వైపు ప్రయాణం.
# మగ పెద్దపులి రుద్రగూడెం గ్రామ పరిసర ప్రాంతంలో సంచారం.

నర్సంపేట/నల్లబెల్లి,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ లో పులి సంచారం సంచలనం రేకెత్తింది. ఒక మగ పులి, ఒక ఆడ పులితో పాటు పులిపిల్ల నల్లబెల్లి మండలం మూడుచుక్కలపల్లె
గ్రామ ప్రాంతంలో విడిపోగా మగ టైగర్ రుద్రగూడెం గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరించగా ఆడపులితోపాటు మరో పులి పిల్ల నల్లబెల్లి మండలం కొండాపూర్ మీదుగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం వైపుకు వెళ్లాయి.నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామ శివారులో పులి సంచరించింది.దాని పాదాల గుర్తులను గుర్తించిన రైతులు వెంటనే ఫార్టెస్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.ఐతే పులి సంచరిస్తున్న విషయం దాహనంగా నర్సంపేట డివిజన్ పరిధిలో వ్యాప్తి చెందడంతో అటు నర్సంపేట మండల ప్రజలు,నల్లబెల్లి మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు.నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన మంకయ్య అనే రైతు వ్యవసాయ భూమిలో మిర్చి సాగు చేస్తున్నారు. పురుగుల మందు,పిండి బస్తాలు పిచికారి చేసే క్రమంలో పులి అడులను గుర్తించిన రైతు మంకయ్య గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు.అటవీ శాఖ అధికారులు,స్థానిక పోలీసులు హుటాహుటిన చేరుకొని పులి సంచరించిన వ్యవసాయ భూమిలో పాదం అడుగులను పరిశీలించి పులి సంచరించిందని నిర్ధారణ చేయగా రుద్రగూడెం గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు.వెంటనే చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు తారస పడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.నల్లబెల్లి మండలంలో అటవీ ప్రాంతం,అలాగే పాకాల అభయారణ్యం ఉండడం మరో విధంగా సంచరించుకుంటుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రుద్రగూడెం గ్రామం పరిసర ప్రాంతాలు నర్సంపేట మండలం ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు వ్యవసాయ పనులకు చేసుకునే రైతులు గొర్ల కాపర్లు, తీవ్ర భయాందోళనలకు గురైతున్నారు. కాగా పులి కాలు అడుగులతో పాటు మలవిసర్జన ఆగుపడడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ అటవీశాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను గుర్తించి దానిని పట్టుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.ఘటన స్థలానికి చేరుకున్న నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ పంట పొలాల్లో ఉన్న అడుగులను పరిశీలించి అవి పులి అడుగులే అని నిర్ధారించారు. పులి సంచారం నిజమే అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ మాట్లాడుతూ నల్లబెల్లి మండలానికి మూడు పెద్ద పులులు వచ్చాయని అందులో ఒక మగ టైగర్, ఒక ఆడ పులితో పాటు పులిపిల్ల నల్లబెల్లి మండలం మూడుచుక్కలపల్లె
గ్రామ ప్రాంతంలో విడిపోగా మగ టైగర్ రుద్రగూడెం గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నదని పేర్కొన్నారు.అలాగే ఆడపులితోపాటు మరో పులి పిల్ల నల్లబెల్లి మండలం కొండాపూర్ మీదుగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం వైపుకు వెళ్లినట్లు గుర్తించామని నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ తెలిపారు. పులి ని గుర్తించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో స్థానిక ఎస్సై గోవర్ధన్ రుద్రగూడెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వ్యవసాయ పనులు త్వరగా ముగించుకొని చీకటి పడకముందే ఇళ్లకు చేరుకోవాలని గ్రామాల్లో దండోరా వేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!