Mega Rythu Mela 2026 Announced
మెగా రైతు మేళా కార్యక్రమం విజయవంతం చేయాలి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రైతులకు ప్రజాప్రతినిధులకు,అనుబంధ శాఖల అధికారులకు తెలియజేయునది ఏమనగా, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా – 2026” కార్యక్రమం హనుమకొండలోని ఆర్ట్స్, సైన్స్ కాలేజ్ మైదానంలో తేదీ:05-05-2026 నుండి 07-05-2026 వరకు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహించబడుతుంది.
ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, కొత్త విత్తన రకాలు, ఎరువులు,పంటల సంరక్షణ పద్ధతులు,యాంత్రీకరణపై ప్రదర్శనలు,వ్యవసాయ నిపుణుల సూచనలు సలహాలు రైతులకు అందుబాటులో ఉంటాయి.
నడికూడ మండలం నుండి రైతుల సౌకర్యార్థం ప్రతి రోజు ఈ కార్యక్రమానికి రెండు బస్సులు ఏర్పాటు చేయబడినవి,వాటి ప్రారంభస్థలము నుండి రోజు ఉదయం 8 గంటల 40 నిమిషములకు ఈ బస్సులు బయలుదేరును.
బస్సుల షెడ్యూల్:
05-05-2026: బస్సు -1 ముస్త్యాలపల్లి నుండి,
05-05-2026: బస్సు-2 నార్లాపూర్ నుండి,
06-05-2026: బస్సు -1 చౌటుపర్తి నుండి,
06-05-2026: బస్సు-2
వరికోల్ నుండి,
07-05-2026: బస్సు-1 నడికూడ నుండి,
07-05-2026: బస్సు-2
చర్లపల్లి నుండి,
ఈ బస్సులు సంబంధిత గ్రామాల నుండి రైతులను మెగా రైతు మేళా ప్రాంగణానికి తీసుకువెళ్లి తిరిగి తీసుకురావడానికి అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు మీకు సంబంధించిన క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగలరు.
కాబట్టి నడికూడ మండలంలోని రైతులు, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాజరై ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్ కోరడమైనది.
