జర్నలిస్టుపై దూర్చుగా ప్రవర్తించిన అధికారిపై చర్య తీసుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న భూపాలపల్లి తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వినతి పత్రం అందజేశారు.
భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం కావడం,మీసేవ కేంద్రాల నిర్వహన సరిగా లేకపోవడంతో విద్యార్థులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ జర్నలిస్ట్ కథనం ప్రచురించగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అధికారి కథనం రాసిన జర్నలిస్టును కార్యాలయం కు పిలిచి బెదిరింపులకు గురిచేయడం జరిగిందని కలెక్టర్ కు వివరించారు.జర్నలిస్ట్ ల వినతి పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యూ జే ఐ ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,టి.యు.డబ్ల్యూ జే టెంజు అధ్యక్షులు కొంకుల సాంబయ్య,బండారి రాజు,పల్నాటి రాజు,కనుకుల దేవేందర్,కార్కూరి సతీష్,సంగెమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.