
Farmer
కరుణించు వరుణ దేవా…
వరుణుడి కోసం రైతుల ఎదురుచూపులు…
వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న…
అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి-చెరువులు,కాలువలు,కుంటలు అడుగంటిపోయినాయి…
నేటి ధాత్రి గార్ల:
జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో మూడు వారాలైన ఒక్క వర్షం పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ వెనక్కి వెళ్తుంది. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు ప్రారంభానికి సరైన వర్షాలు లేవు. జూన్ నెల ప్రారంభమై 20 రోజులు దాటిన ఎండలు మండిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు పైబడి నమోదు అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసిన మండుతున్న ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని రైతులు చెబుతున్నారు. తొలకరి చినుకులు కురుస్తాయని ఉద్దేశంతో పది రోజుల కిందట వరి దుక్కులు ప్రారంభించారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసుకున్నారు. మొలకలు వచ్చినప్పటికీ ఎండకు పంట అంతా ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.
