నడికూడ,నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జాయింట్ కలెక్టర్ మహేందర్ జి నడికూడ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ప్రతి వాహనం తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుంపులు గుంపులుగా వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా అనుమానం వచ్చిన వాహనాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రజా ప్రతినిధుల వాహనం తనిఖీ చేయవలసిందేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, చెక్ పోస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.