గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,సెక్రెటరీ గోక వినోద్ బాబు
నర్సంపేట,నేటిధాత్రి :
గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా నర్సంపేట పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళల ఆదరాభిమానాలు చూరగొంటు అదే స్ఫూర్తితో గోక లీలావతి జ్ఞాపకార్థం పదవ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు వాటిని విజయవంతం చేయాలని గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు, సెక్రెటరీ గోక వినోద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా గోక వినోద్ బాబు మాట్లాడుతూ ట్రస్ట్ అధ్యక్షులు గోక రామస్వామి గారి పర్యవేక్షణలో ఈనెల 12 న పట్టణంలోని మల్లంపల్లి రోడ్డుకు గల మినీ స్టేడియంలో భారీ ఎత్తున జబర్దస్త్ ఫేమ్ వర్ష స్పెషల్ అట్రాక్షన్ గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి 1116 ఒక్కరికి, రెండవ బహుమతి 5116 ఇద్దరికీ, మూడవ బహుమతి 3116 ముగ్గురికి, 1116 లు ప్రత్యేక బహుమతులుగా పదిమందికి ఇవ్వనున్నట్లు గోక వినోద్ బాబు తెలిపారు. ప్రతిఏటా 300 లకు పైగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న మహిళలతోపాటు కాలేజీ విద్యార్థినిలు ముగ్గుల పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫ్రేమ్ రాకెట్ రాఘవ, వర్ష తోపాటు పలువురు పాల్గొననున్నారని తెలిపారు. ఆసక్తి గల మహిళలు 9849748488 నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన అన్నారు.