రజక సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
భూమికోసం, భుక్తి కోసం బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన వీర వనిత, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని రామకృష్ణాపూర్ బి జోన్ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి లు అన్నారు. మంగళవారం బీ జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిధులుగా ఎస్ఆర్కే పాఠశాల కరస్పాండెంట్ ఉప్పలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సమ్మయ్య, అధ్యక్షులు తిరుపతి లు మాట్లాడుతూ… నిజాం నవాబులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అని, ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిందని అన్నారు. భూసాములతో పోరాడి అమరురాలైందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, ఆఫీస్ ఇంచార్జ్ రాంబాబు, సభ్యులు తిరుపతి, రాములు, సమ్మయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.