రాష్ట్ర స్థాయి మాథమెటిక్స్ పోటీల్లో అక్షర స్కూల్ విద్యార్థుల ప్రతిభ…

రాష్ట్ర స్థాయి మాథమెటిక్స్ పోటీల్లో అక్షర స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గ్రాండ్ ఛాంపియన్‌గా మోక్ష, ప్రథమ శ్రేణిలో యశోవర్ధన్

నర్సంపేట,నేటిధాత్రి:

హైదరాబాద్‌లో నిర్వహించిన బ్రెయిన్ డీ మాథమెటిక్స్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లో అక్షర ద స్కూల్ విద్యార్థులు మంకు మోక్ష, మంకు యశోవర్ధన్ రెడ్డి ప్రతిభ కనబరిచారు.ఈ పోటీల్లో మోక్ష అద్భుత ప్రదర్శనతో గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకోగా, యశోవర్ధన్ రెడ్డి ప్రథమ శ్రేణి సాధించారు.ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఏ. వనజ విద్యార్థులను అభినందించారు.ఈకార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్. జ్యోతి, అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version