కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ..

కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై ప్రధానంగా చర్చ..

 

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (Union Minister CR Patil) సీఎం సమావేశమయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు ముఖ్యమంత్రి.

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

#మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల..

#భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు..

#మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఏర్పాట్ల క్షేత్రస్థాయి పరిశీలన – రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..

హన్మకొండ, నేటిధాత్రి:

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నాడు జిల్లా జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్, పోలీస్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులకు అందించే సౌకర్యాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూ లైన్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకల మార్గాలు వంటి విషయాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేదమంత్రాల సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించామని, రవాణా మరియు పోలీస్ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో భక్తులందరూ అధికారులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, సతీష్, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ఆలయ ఈఓ అనిల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలగి చాలా పెద్ద తప్పు చేశామనే భావనలో బంగ్లాదేశ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ లభించింది.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(Worl Cup-2026) నుంచి తప్పుకుని చాలా పెద్ద తప్పు చేశామనే భావనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇదే సమయంలో ఐసీసీ కూడా వారిపై చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీబీకి భారీ ఊరట లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడమని పాకిస్థాన్(Pakistan) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశం జరగ్గా.. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఇదే మీటింగ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు పాల్గొనకపోవడంపై ఐసీసీ(ICC) నిరాశ వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడా పరమైన, పరిపాలనా జరిమానా విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని తెలిపింది. దీని వల్ల వారి హక్కులకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version