తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌…

తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌

మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ అని మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్లు, గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధ్యమవుతుందని నిరూపించిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన, మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఆధిపత్యాన్ని ఎదుర్కొని బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల శ్రీరామ్ గౌడ్, కల్లెపు ప్రణీత్ గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు డా. చిర్ర రాజు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, గట్టు రమేష్ గౌడ్, బండారి జనార్దన్ గౌడ్, జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, శ్రీపతి గోపి గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గైని సాంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version