ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.
సర్పంచ్ గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో అభివృద్ధి సంక్షేమ పనులు చేసి గ్రామాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు* అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సర్పంచి నాగమల్లేశ్వరరావు,ఉప సర్పంచి ముద్దన నాగరాజు పాలకవర్గం ప్రమాణ స్వీకారం* చేసిన అనంతరం వారు మాట్లాడుతూ…
గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతూ గ్రామ ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా*పేరు వచ్చే విధంగా ప్రజలందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తానని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తనను గ్రామస్తులు భారీ మెజారిటీతో గెలిపించినందుకుగాను ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలుపుతానని అన్నారు.
కార్యక్రమంలో.
ఉపసర్పంచ్ ముద్దన నాగరాజు వార్డు సభ్యులు కడియాల సాంబశివరావు, పాశం స్వర్ణలత, మక్కెన వినోద, పావులూరి శ్రీలత, మన్నెం వెంకట భారతి, పెనుముచ్చు ఆదినారాయణ, కంకణాల శ్రీనివాసరావు, శాకమురి రామకోటేశ్వరరావు, కొంక హరిబాబ ముని మాకుల నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి శివ కారోబార్ యుగేందర్ పంచాయతీ సిబ్బంది* గ్రామస్తులు పాల్గొన్నారు.
