
శీర్షిక:తొలి ఉగాది
పుడమి ఆకు పచ్చని చీర కట్టుకుని… స్వా గతం సుస్వా గతం తెలుపగా వచ్చింది తొలి ఉగాది..! ఇంద్రుడు మేఘ మాలికల విల్లులతో తుంపర, తుంపరులుగా చినుకుల బాణాలు విడుస్తూ … స్వా గతం సుస్వా గతం తెలుపగా వచ్చింది తొలి ఉగాది..! పండిన కొత్త చింత పులుపు వగరు మామిడి ఉరింపులు పలుకగా భిన్నసంస్కృతులకు బహు పునాది వేస్తూ వచ్చింది తొలి ఉగాది..! సంస్కృతి సంప్రదాయాలను ఒకటిగా చేసి చైత్ర మాసపు ఊసులు చెప్తూ గండు…