సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయి: వజ్రేష్ యాదవ్

సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయి : డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్

* అలియాబాద్ మున్సిపాలిటీ లాల్‌గడి మలక్‌పేట్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అదే పార్టీ విజయానికి బాటలు వేస్తుందని డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, అంజి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీబుద్దీన్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అదే పార్టీ విజయానికి బాటలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమలో మున్సిపాలిటీ అధ్యక్షులు తుంకి రమేష్, మాజీ అధ్యక్షుడు వై ఎస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version