రుక్మాపూర్ నుండి ఝరాసంగం వరకు పూర్తిగి పాడైన రోడ్డు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. న్యాల్కల్ మండలం రుక్మాపూర్ నుంచి సిద్ధాపూర్ గ్రామం మీదుగా సాగే ఈ రహదారి కంకర తేలి గుంతలు పడటంతో నిత్యం వేల సంఖ్యలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్ అండ్ బి శాఖ అధికారుల అశ్రద్ధ కారణంగా రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు ప్రమాదాలు జరుగుతున్నా మరమ్మత్తు పనులు చేపట్టడం లేదని, ఈరోజు ఆలయ దర్శనానికి వచ్చిన భక్తుల కారు గుంతలో పడి ప్రమాదానికి గురైందని సమాచారం.
