రాజీవ్ నగర్ తాగునీటి కష్టాలు తీర్చాలి: అధికారులకు ఆంజనేయులు సాగర్ వినతి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ సోమవారం జలమండలి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బస్తీలోని పలువురు నాయకులతో కలిసి ఆయన జనరల్ మేనేజర్ హరి శంకర్ గారిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ.. రాజీవ్ నగర్ బస్తీలో కొన్ని ఇళ్లు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల తాగునీరు సరిగ్గా చేరడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటి సరఫరా అందక బస్తీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఎత్తైన ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరడానికి ప్రత్యేకంగా బూస్టర్సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు బస్తీ ప్రజల అవసరాల కోసం తాత్కాలికంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి. మోటార్‌ను ఏర్పాటు చేయాలి.జీఎం హరి శంకర్ సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న సాగర్, నరసింహ, వెంకటేష్, రోహిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
