100 శాతం సబ్సిడీపై కూరగాయల విత్తనాల కిట్ల పంపిణీ
దుగ్గొండి,నేటిధాత్రి:
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100 శాతం సబ్సిడీపై ఐదు రకాల కూరగాయల విత్తనాలు (టమాట, పచ్చిమిర్చి, బెండ, తోటకూర, పాలకూర) కలిగిన కూరగాయల విత్తనాల కిట్లను దుగ్గొండి మండలంలో పంపిణీ చేయడం జరిగిందని హార్టికల్చర్ అధికారి జ్యోతి తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంపొందించుట మరియు రైతులను ప్రోత్సహించుట లక్ష్యంగా ఉచితంగా కూరగాయల విత్తనాల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యామ్నాయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి హనుమంత్, ఉద్యాన విస్తరణ అధికారి త్రివేణి పాల్గొన్నారు. అలాగే లక్ష్మీపురం, వెంకటాపురం, తోగర్రాయి,శివాజీ నగర్ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు
