టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.
ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పాక్‌ను పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.
నమ్మకం ఉంది..
మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ కిషన్ మాట్లాడాడు. ‘వికెట్ అంత సులభంగా లేదు. కానీ నా బలాల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆఫ్‌సైడ్ ఆటపై ఎక్కువగా శ్రమించాను. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాను. 160-170 స్కోరు సరిపోతుందని ముందే అనుకున్నాను’ అని తెలిపాడు.
