Excise and Police Raid Illegal Liquor Dens
అక్రమ గుడుంబా స్థావరలపై ఎక్సైజ్ శాఖ,పోలీస్ ల మెరుపు దాడులు
ధ్వంసం చేసి 2500 లీటర్ల గుడుంబా పానకం
మంచిర్యాల,నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అక్రమ గుడుంబా తయారీ కేంద్రంపై పోలీసులు,ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా మంగళవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు.చెన్నూర్ పరిధిలో నీల్వాయి ఎస్సై ఆధ్వర్యంలో, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ సమక్షంలో చెన్నూర్,బెల్లంపల్లి ఎక్సైజ్ అధికారులతో కలిసి బుయ్యారం గ్రామంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో గుర్తించిన 30 గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి,సుమారుగా 2500 లీటర్ల పులియపెట్టిన బెల్లం పానకం ను 25 డ్రమ్ములను స్వాధీనం చేసుకొని సంఘటన స్థలంలోనే బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.అనంతరం అధికారులు గ్రామస్తులతో సమావేశమై అక్రమంగా గుడుంబా తయారీ,విక్రయం చేయడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు.గుడుంబా తయారీ లేదా విక్రయంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు అక్రమ మద్యం తయారీ వినియోగానికి దూరంగా ఉండాలని,గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అధికారులు సూచించారు.ఈ ప్రత్యేక డ్రైవ్ లో పోలీస్,ఎక్సైజ్ శాఖలకు చెందిన సుమారు 40 మంది అధికారులు,సిబ్బంది
