బాల్యానికి బలం బాలామృతం * ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుజాత మొగులపల్లి…

బాల్యానికి బలం బాలామృతం * ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుజాత మొగులపల్లి

నేటి ధాత్రి ప్రభుత్వం

ఉచితంగా పంపిణీ చేసే బాలామృతం చిన్నారులకు వరం లాంటిది ఇందులో అనేక పోషకాలు అనేక పోషకాలు ఉంటాయి పుట్టిన బిడ్డ నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు బాలామృతం అందజేస్తున్నాం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూపర్వైజర్ సుజాత పేర్కొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పార్లపల్లి సెక్టార్ పరిధిలోని పెద్ద కోమిటిపల్లి అంగన్వాడి కేంద్రంలో సోమవారం బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయసు గల చిన్నారులకు అలాగే కిషోర్ బాలికలకు బాలామృతం మరియు చిక్కిప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారంలో అనేక విటమిన్లు పోషకాలు ఉండి పిల్లలకు శారీరక మానసిక అభివృద్ధికి దోహద పడతాయని వివరించారు కిశోర బాలికల రక్తహీనత సమస్యకు గురికాకుండా ఉండేందుకు చిక్కి ప్యాకెట్లను సరిపడా చేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరు అంగన్వాడి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా తల్లులు సమక్షంలో పిల్లలు ఎత్తుకొని బరువు కలిసి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు ప్రతినెల పిల్లల ఎదుగుదలను గమనించడం చాలా అవసరం అని మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని తల్లులకు సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పుష్పలత స్కూల్ టీచర్ సుమలత తల్లులు పిల్లలు కిశోర బాలికలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version