పూరి సేతుపతి సెట్‌లో.. సర్ మేడమ్‌సెలబ్రేషన్స్
విజయ్ సేతుపతి నూతన చిత్రం సర్ మేడమ్ సెలబ్రేషన్స్ పూరి జగన్నాథ్ కార్యాలయంలో నిర్వహించారు.
నిత్యం వైవిధ్యభరిత సినిమాలతో అలరిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తాజాగా సర్ మేడమ్ అనే తమిళ అనువాద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగులో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ (Samyuktha) కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు.
అయితే విజయ్ సేతుపతి రీసెంట్ సినిమా తలైవర్ తలైవి (సర్ మేడమ్ Sir Madam) ఈ రోజు (శుక్రవారం) థియేటర్లలో విడుదలైన ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో చార్మీ (Charmme Kaur), పూరి (Puri Jagannadh) సమక్షంలో హైదరాబాద్‌లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో పాటు పూరి జగన్నాథ్, ఛార్మీ వారి సినిమా బృందం (#PuriSethupathi) పాల్గొంది. ఇదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.