రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మొహమ్మద్ యూనుస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, ఎంపీ ఎమ్మెల్యేలకు లేని పిల్లల నిబంధన కేవలం లోకల్ బాడీలో అమలు చేయడం వల్ల ఎంతోమంది నాయకులు పోటీకి దూరం అయ్యరని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వారికి కూడా పోటీ చేసే అవకాశం దక్కిందని, దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన న్యాల్కల్ మండల అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్.
