జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మహాదేవపూర్ పోలీస్
* పలు అంశాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ పవన్ కుమార్
మహాదేవపూర్ అక్టోబర్ 24 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ ను మహాదేవపూర్ పోలీసులు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భం గా ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో రెండో ఎస్సై సాయి శశాంక్ తో కలిసి జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించి దానిలో భాగంగా పోలీస్ స్టేషన్లో పిటిషన్ మేనేజ్మెంట్, ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్, డయల్ హండ్రెడ్, రికార్డ్ మేనేజ్మెంట్, సైబర్ క్రైమ్ తో పాటు పలు అంశాలపై సరళమైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాపకేతర బృంద, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
