చింతల్ ఘాట్ వద్ద ఉచిత మట్టి నీటి కుండల సేవా కార్యక్రమం ప్రారంభం…

చింతల్ ఘాట్ వద్ద ఉచిత మట్టి నీటి కుండల సేవా కార్యక్రమం ప్రారంభం

◆”-: ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న టిపు సుల్తాన్ సోషల్ సర్వీస్ టీమ్…

◆”-: మాజీ టిజిఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ చేతుల మీదుగా ప్రారంభం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతల్ ఘాట్ వద్ద ఉచిత మట్టి మినరల్ వాటర్ కుండల సేవా కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని టిపు సుల్తాన్ సోషల్ సర్వీస్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టిజిఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ తన్వీర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ప్రయాణికులు, కూలీలు, స్థానిక ప్రజలకు ఈ మట్టి నీటి కుండలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సమాజ సేవలో టిపు సుల్తాన్ సోషల్ సర్వీస్ టీమ్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోహిర్ మున్సిపల్ వైస్ చైర్మన్ హన్నాన్ జావేద్, హఫీజ్, ముజ్జఫర్ హుస్సేన్, హమీద్, సంపత్, సర్ఫరాజ్ ఫిర్ద్స్ (యూత్ ఐకాన్ కోహిర్), యూసుఫ్ పటేల్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. టిపు సుల్తాన్ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చింతల్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఈ ఉచిత మట్టి నీటి కుండల కార్యక్రమం నిర్వహించడం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. వేసవి కాలంలో ప్రయాణికులు మరియు గ్రామస్తులకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version