సీఎం కప్ క్రీడలు ప్రారంభం
సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన కేసముద్రం ఎమ్మార్వో జి. వివేక్
కేసముద్రం/ నేటి ధాత్రి
సీఎం కప్ క్రీడా పోటీలు సోమవారం సెయింట్ జోన్స్ హై స్కూల్ క్రీడామైదానం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల ఎం ఆర్ ఓ జి వివేక్ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ మండల స్థాయిలో సీఎం కప్ ఆడే క్రీడాకారులు మంచి ప్రతిభను కనపరిచి నియోజకవర్గ మరియు జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో విజయ పదంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర గేమ్స్ నిర్వహించడం జరిగింది. కాగా క్లస్టర్ లెవెల్లో క్రీడాకారులు మండల స్థాయిలో 150 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు లాల్ బహుదూర్, ఎస్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ కొమ్ము రాజేందర్, కొప్పుల శంకర్, దా మల్ల విజయ చందర్, కే. పద్మ, స్రవంతి, విజయనిర్మల, తారక, వీరన్న, వెంకన్న, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
