ఓ వైపు కోతులు…. మరోవైపు కుక్కలు…

ఓ వైపు కోతులు…. మరోవైపు కుక్కలు

భయాందోళనలో ప్రజలు

ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలి

శాయంపేట నేటిధాత్రి;

 

శాయంపేట మండలంలోని ప్రజలు జీవితంలో ఎదుర్కొం టున్న అతి ప్రధాన సమస్యలు ఏమిటి అంటే ప్రశ్నించుకుంటే మొదటగా కోతులు , కుక్కలు వల్ల ఎదురవుతున్న ఇబ్బం దులు ప్రస్తావన వస్తుంది సమస్య అతి తీవ్రంగా పత్తిపా క గ్రామంలో కోతుల వల్ల ప్రాణాలు కోల్పోవడంవల్ల , కు టుంబ సభ్యులు అనాధలుగా మిగిలిపోయారు దీన్ని గల కారణాలు ఏమిటి? అధికా రులు ఆత్మ పరిశీలన చేసు కోవాలి! మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల కాలంగా కోతులు కుక్కల బెడద పెరిగి పోతుంది వీధుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు నడవడానికి కష్ట సాధ్యమవుతుంది ఎటువైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ రెండు జంతువు ల వల్ల ప్రజలు తీవ్ర భయాందో ళనకు గురవుతున్నారు. వీధుల్లో కుక్కలు గుంపులు, గుంపులుగా సంచరిస్తూ వాటి దాడులతో పలువురు గాయా లపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి పలువురు గాయపరిచిన ఘటనలు, మరోవైపు ఇండ్ల పై కప్పులు చెట్టుపై తిరుగుతున్న కోతులు పిల్లలపై మహిళలపై ఇంటి యజమాన్యాలపై దాడి చేసే ఘటనలు తరచూ జరుగు తున్నాయి

కోతుల దాడిలో వ్యక్తి మృతి

అనాదులుగా కుటుంబ సభ్యులు

ఇటీవల కాలంలో కోతుల దాడుల వల్ల మృతి చెందిన భార్య పిల్లలు తల్లిదండ్రులు అనాధలుగా మిగిలిపోయారు పత్తిపాక గ్రామ ప్రజలు కోతుల కుక్కలను వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతు న్నారు. ఇందులోకి చొరబడు తున్న కోతులు ప్రజలకు కలవ రాన్ని సృష్టిస్తుంది రోజు రోజు కు బయటకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు వెంబడిస్తాయో కుక్కలు దాడి చేస్తాయో తెలియడం లేదు అని స్థానికులు వాపోతున్నా రు.

ప్రజల ఇబ్బందులు అధి కారులు ఆలోచన చేసి కోతు లను కుక్కలను అరణ్య ప్రాం తాలకు తరలించే ప్రయ త్నాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటే ప్రజలకు బాధ్యత కల్పించిన వారవుతారని కోరుతున్నారు
ఇప్పటికైనా కోతులు మరియు కుక్కల వల్ల కలిగే ఇబ్బందు లను నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version