ఫ్యూచర్ సిటీ అభివృద్ధి – తెలంగాణ భవిష్యత్తు ఎటు…

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి – తెలంగాణ భవిష్యత్తు ఎటు

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
హన్మకొండ బీజేపీ జిల్లా నాయకులు.

హన్మకొండ :నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాశంగా మారింది ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. తెలంగాణ మొత్తం అభివృద్ధి అవుతుందా. లేక ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందా. అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవు తున్నాయి .

ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ నుండి నేరుగా విజయవాడ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుండి విజయవాడ బందర్ పోర్ట్ వరకు 12 లైన్లో భారీ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వంను అనుమతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టులు చేస్తే ఫీచర్ సిటీ అభివృద్ధి చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుండి విజయవాడకు డైరెక్టర్ రైల్వే లైన్ వేస్తే ఇప్పటివరకు ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా ఉన్న కాజీపేట ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉంది. వరంగల్ కాజీపేట మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజల్లో ఆందోళన వినిపిస్తుంది.
భవిష్యత్తులో అసెంబ్లీ సచివాలయం ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాన్ని ఫీచర్ సీటీ కీ తరలించే ఆలోచన కూడా ఉందా. ఈమధ్య విదేశీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మీ కార్యాలయం ఫీచర్ సీటీ లో ఏర్పాటు చేయాలని సూచించినట్టు వార్తలు కూడా రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ ను మూడు ముక్కలు చేయడం మూసినది అభివృద్ధి ప్రాజెక్టు వంటి నిర్ణయాలు చూస్తే రాబోయే కాలంలో హైదరాబాద్ పరిపాలన వ్యవస్థలో కూడా పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గల్లో చర్చ జరుగుతుంది
ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎవరు తప్పు పట్టారు. కొత్త నగరాలు రావాలి. పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు రావాలి. కానీ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం అయితే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. తెలంగాణ ఏర్పడిన ప్రధాన కారణాలు ఒకటి ప్రాంతీయ అసమానతలు అదే పరిస్థితి మళ్ళీ రావద్దంటే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా జరగాలి. వరంగల్ ఖమ్మం నిజామాబాద్ అదిలాబాద్ మహబూబ్నగర్ లాంటి జిల్లాల్లో కూడా పరిశ్రమలు ఐటి కంపెనీలు విద్యాసంస్థలు మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. లేకపోతే తెలంగాణలో అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం అవుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version