మొగుడంపల్లి మండలంలో ఆకస్మిక ఇన్స్పెక్షన్ అధికారుల తనిఖీ…
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాల మన్నాపూర్ మరియు రాయిపల్లి తండా పాఠశాలలు ఈ రోజు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ మరియు జిల్లా ఇన్స్పెక్షన్ టీం మెంబెర్స్ యం,డి వాహబోదీన్, నిమ్మల కిష్టయ్య, పైన పేర్కొన్న పాఠశాలలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఎఫ్ఎల్ఎన్, సీసీఈ రికార్డ్స్ , పిటిఎం , లు క్షుణ్ణంగా రికార్డులను తనిఖీ చేసి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా అధికారులు తగు సూచనలు చేయడం జరిగింది.
