భగత్ సింగ్ వర్ధంతి –పీడీఎస్‌యూ నివాళులు…

భగత్ సింగ్ వర్ధంతి –పీడీఎస్‌యూ నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కొమ్ముక రవి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల త్యాగాలు యువతకు ఆదర్శమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు యుద్ధాలను ప్రోత్సహిస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఖండించారు. ఇరాన్, పాలస్తీనా దేశాలపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.దేశంలో ధరల పెరుగుదల, విద్యా రంగ ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నవీన్, రూప్ పాల్, అనీష్, దీపక్, సామి, శ్రీ ఆచార్య, లక్కీ, సోనీ, అద్విత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version