నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ.
బాలానగర్ /నేటి ధాత్రి.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మన్నెగూడెం తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని జోగ్య నాయక్ తాండలో అంగన్వాడీ ఉపాధి ఎన్.ఆర్.జి.సి పథకం ద్వారా నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ జటావత్ రాజు నాయక్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య సదుపాయాల మెరుగుదలకు ఈ నిర్మాణ పనులు ఉపయోగపడనున్నాయని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయన్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేనావత్ హీర్యా నాయక్, ఎన్.ఆర్.జి.సి నాగేశ్వరి, 6వ వార్డు సభ్యులు అంజి వెంకటేష్, 7వ వార్డు సభ్యులు నేనావత్ హరిసింగ్, మాజీ సర్పంచ్ మోతి, మాజీ డిప్యూటీ సర్పంచ్ సోమ్లా నాయక్, నేనావత్ రాములు నాయక్, కాంట్రాక్టర్ రాజు, నర్సింహ, రవి, జగ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
