విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి…

విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని,ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల నిమిత్తం జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వెలుతురు,ఫ్యాన్లు,మూత్రశాలలు, అత్యవసర నిమిత్తం అవసరమైన మందులు,వైద్య సిబ్బంది నియమించడం జరిగిందని,పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version