గ్రామాల్లో ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి…

గ్రామాల్లో ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి

గణపురం తాసిల్దార్ కార్యాలయంలోమధురకవి సత్యనారాయణ స్వామి కి వినతిపత్రం అందించడం జరిగింది

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో గణపురం తాసిల్దార్ కార్యాలయంలో మధురకవి సత్యనారాయణ స్వామికి కుల నిర్మూలన వినతి పత్రం అందించడం జరిగింది భారత రాజ్యాంగ ప్రకారం దేశ రాష్ట్రవ్యాప్తంగా అంటరానితనం అస్పృశ్యత కుల వ్యవస్థ మూఢనమ్మకాలను అంశాలపై ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరిస్తూ వాటిపై అవగాహన కల్పించడానికి ప్రతినెల 30న గ్రామాల్లో పౌర హక్కుల (సివిల్ రైస్ డే) దినోత్సవం జరపాలని అలాగే దళితవాడల్లో సహం పంక్తి భక్తి భోజనాలు ఏర్పాటు చేయాలి ఈ పౌర హక్కుల దినోత్సవం లో గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే విధంగా చూడాలని గ్రామంలోని సర్పంచ్ వార్డు నెంబర్లు కులాల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఈ పౌర హక్కుల దినోత్సవం పాల్గొనే విధంగా చూస్తూ సంబంధిత అధికారులతో అంటరానితనం కుల వ్యవస్థ అస్పృశ్యత మూఢనమ్మకాలపై దళితులకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా ఇందులో సహా పత్తి భోజనాలు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జాతీయ కార్యదర్శి ఎండి సైదులు భాష మండల నాయకులు పాల్గొన్నారు

గ్రామాలలో ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి.

గ్రామాలలో ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత.

అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

శనివారం టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ మారపల్లి కొమురయ్య ఆధ్వర్యంలో ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల ( సివిల్ రైట్స్ డే) దినోత్సవాన్ని జరపాలని అంబేద్కర్ ఫెలోషి ప్ నేషనల్ అవార్డు గ్రహీత రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య తహసిల్దార్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం సంబంధించిన అధికారులు జరుపుతున్నారు . ఈ పౌర హక్కుల దినోత్సవం లో గ్రామ సర్పంచి వార్డ్ మెంబర్లు వివిధ కులాల ప్రజలు ఇందులో పాల్గొనే విధంగా చూడాలని ముఖ్యంగా సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు ఎస్సీలు ఎదుర్కొంటున్న అంటరానితనం కుల వ్యవస్థ మూఢనమ్మకాలు అస్పృశ్యత అను అంశాలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నారు .దేశ రాష్ట్రవ్యాప్తంగా పౌర హక్కుల దినోత్సవం రోజు అధికారులు కొందరు తూతూ మంత్రంగా జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలలో ఇంకా కుల వ్యవస్థ అంటరానితనం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వాలు అధికారులు ఈ కుల వ్యవస్థ జరిగిన గ్రామాలలోని వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల దినోత్సవం నిర్వహించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన అధికారులను డిమాండ్ చేశారు. లేని యెడల దళిత సంఘాల తో కలిసి దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ అరకొండ రాజయ్య అంబేద్కర్ వాదులు గోదా బిక్షపతి అరకొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version