బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు బాల్నే సర్వేశం సతీమణి బాల్నే చంద్రకళ సంవత్సరీకం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బాల్నే సర్వేశంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, పట్టణ ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.