బాలానగర్ లో.. సీఎం కఫ్ క్రీడలు ప్రారంభం…

బాలానగర్ లో.. సీఎం కఫ్ క్రీడలు ప్రారంభం

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలు ఎంఈఓ శంకర్ గురువారం ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తామన్నారు. గ్రామీణ స్థాయిలోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లెనిన్ గౌడ్, నందమోని రాజేశ్వరి దత్తాత్రేయ, వార్డు సభ్యులు, వివిధ పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ఎంపీడీవో మున్వర్

కొత్తగూడ నేటిధాత్రి

కొత్తగూడ మండల కేంద్రంలోని స్పోర్ట్స్ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో మన్వర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు.మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపించేందుకు ఈ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మన్వర్ తెలిపారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఈటీలు, క్రీడా నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version