కృష్ణవేణి స్కూల్‌లో స్వాతంత్ర్య, కృష్ణాష్టమి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-5.wav?_=1

శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

Krishnaveni School

చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నస్పూర్ మెకానిక్స్ అసోసియేషన్‌లో స్వాతంత్ర్య వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-10-6.wav?_=2

టూ వీలర్ మెకానిక్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ జెండాను ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ..స్వతంత్ర పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ,వారు ప్రసాదించిన స్వేచ్ఛను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని కోరుతూ,రోజువారి మానవ జీవన ప్రయాణంలో అత్యంత అవసరమైన మోటార్ సైకిల్ లను బాగుచేస్తూ ఎంతో మంది రోజువారి జీవితాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మెకానిక్ సోదరులందరికీ,ఇంకో విధంగా చెప్పాలంటే మోటార్ సైకిల్ వైద్యులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మెకానిక్ మిత్రులు అందరూ ఐక్యతతో ఉండాలని,వృత్తి పట్ల నిబద్ధతతో,నిజాయితీతో వ్యవహరించాలని,నమ్మి వచ్చిన కష్టమర్లకు న్యాయం చేయాలని సూచించారు.యూనియన్ కి అన్న విధాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు పభాస్కర్, జనరల్ సెక్రెటరీ నేరెళ్ల నరేష్ గౌడ్,సహాయ కార్యదర్శి జడల మహేష్,ప్రచార కార్యదర్శి మహమ్మద్ అల్లావుద్దీన్, భానేష్ సభ్యులు,తోటి మెకానికులు పాల్గొన్నారు.

నర్సాపూర్ కల్వర్టు మరమ్మత్తుల కోసం విజ్ఞప్తి..

కల్వర్టు పనులు బాగు చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ కు వినతి

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

తాండూరు మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ లోని నర్సాపూర్ గ్రామంలో మంగళవారం కురిసిన రాత్రి వర్షానికి కల్వర్ట్ లోని పైపులు కొట్టుకొని పోయాయి.వాటిని బాగుచేయాలని,రోడ్డు మరమ్మత్తులు చేయాలని, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కి విన్నవించుకోవడం జరిగింది.వారు
సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పరిష్కరిస్తారని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తుడుం దెబ్బ తాండూర్ మండల అధ్యక్షులు కుర్సెంగ బాబురావు గ్రామస్తులు సోయం పర్బత్ రావు, దిన్ధర్సవ్,శ్యామ్ రావు, బాదిరావు,జంగు,బొజ్జిరావ్,
అనిల్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

శ్రీరాంపూర్‌లో నంది అవార్డు పోస్టర్ ఆవిష్కరణ…

ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నంది అవార్డు పురస్కారాల పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరాంపూర్,నేటి ధాత్రి:

 

 

ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ,స్వచ్చంద సేవ సొసైటీ సంస్థ దసరా పండుగ పురస్కరించుకొని రాష్టం లోని కళాకారుల ప్రతిభని గుర్తించి,వారిని ప్రోత్సహించేందుకు విజయదశమి ఉత్తమ కళారత్న నంది అవార్డ్ పురస్కారాలు సెప్టెంబర్ 28 న మంచిర్యాలలో నిర్వహించబడుతుంది.గురువారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు,జానపద కళాకారుల,ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హన్మాండ్ల మధుకర్,మంచిర్యాల జిల్లా నృత్య కళ సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్,ఉపాధ్యక్షులు రామగిరి అర్జున్,డాన్స్ మాస్టర్స్ రిథమ్ సది,మాస్టర్ రమేష్ బాబు, డైరెక్టర్ కె.తిరుపతి వర్మ ,రవీందర్ వర్మ ,స్టాలిన్,తిరుపతి,కార్య నిర్వాహకులు దుర్గం విజయ్,కొప్పర్తి సురేందర్,బెల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 18–25 పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు..

ఆగస్టు18 నుండి 25 వరకు పాపన్న గౌడ్ 375 వ జయంతి వరోస్తవాలు జయప్రదం చేయండి

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

భారతదేశం మొట్టమొదటి దళిత బహుజన విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధన మార్గాన్ని సూచించి మొగలు పాలకుల మెడలు వంచి పన్నులను రద్దు చేసిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతివారోత్సవాలను దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుండి 25 వరకు గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జయప్రదం చేయాలని రాష్ట్ర గౌడ సోదరులందరికి పిలుపునిస్తున్నాం.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T163644.758.wav?_=3

_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మెడికల్ ల్యాబ్ యూనియన్‌కు ఐఎంఏ సంపూర్ణ మద్దతు.

మెడికల్ ల్యాబ్ యూనియన్‌కు ఐఎంఏ సంపూర్ణ మద్దతు

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రి.నెం.374/2020 యూనియన్ వారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా నాయకులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమణ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు ఇటీవల ఎన్నుకున్నటువంటి తమ నూతన యూనియన్ గురించి ఆయనకు వివరించారు.డాక్టర్ రమణ స్పందిస్తూ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలు మరియు వారి యూనియన్ అవశ్యకతను పూర్తిగా అర్థం చేసుకుని,వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.వైద్య రంగానికి ల్యాబ్ టెక్నీషియన్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవి అని ఆయన ప్రశంసించారు.కొత్తగా ఏర్పడిన ఈ యూనియన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ,నూతన యూనియన్ కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి,తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.అనంతరం మంచిర్యాల జిల్లా డ్రగ్గిస్ట్ కెమిస్ట్ జనరల్ సెక్రెటరీ టి.సుధాకర్ నీ కలిసి మాట్లాడటం జరిగింది.సానుకూలంగా స్పందించిన సెక్రటరీ సుధాకర్ ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.యూనియన్ అంతా కలిసికట్టుగా నడుస్తూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందునూరి ప్రశాంత్,ఉపాధ్యక్షులు చంద్రమౌళి,ఇర్షాద్,ప్రధాన కార్యదర్శి కాజా పాషా,ట్రెజరర్ కామని శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి శైబజ్,పలువురు ల్యాబ్ టెక్నషియన్లు పాల్గొన్నారు.

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్.

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్ గా శ్రీపతి రాములు గౌడ్ నియామకం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ,సంస్థ నియమ,నిబంధనలు పాటిస్తూ,సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని,ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని,పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ.

ప్రచురణార్ధం
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
-రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
-ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:

 

తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్.

మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ విజయవంతం.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ
విజయవంతం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి

మంచిర్యాల జూన్ 18 నేటిదాత్రి:

shine junior college

 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఈనెల 20వ తేదీన నస్పూర్ లోని ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో-కన్వీనర్లు కె.వెంకటస్వామి, గడ్డం సత్యగౌడ్ తదితరులు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫెడరేషన్ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్లొంటారని వారు పేర్కొన్నారు. జిల్లాలో సంఘం నిర్మాణం, సభ్యత్వం, జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై ఈ సందర్భంగా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిచనున్నట్టు తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో విరివిగా సభ్యత నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న విలేకరులు స్వచ్ఛందంగా సంఘంలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తో పాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాత్రికేయ మిత్రులను మహాసభకు సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు భాస్కర్, చంద్రమౌళి  పాల్గొన్నారు.

అయ్యా మా గోడు పట్టించుకోండి.

అయ్యా మా గోడు పట్టించుకోండి

మందమర్రి నేటి ధాత్రి

 

shine junior college

 

శ్రీయుత గౌరవనీయులైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికీ నమస్కరించి వ్రాయునది*

*గ్రామాలలో గుడుంబా నియంత్రించాలని కోరుతూ

విషయం మందమర్రి పట్టణ,మరియు మండలంలో ఉన్న గ్రామాలలో గుడుంబా మద్యం విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంది గుడుంబా నిలుపుదల కొరకు

అయ్యా మా గ్రామం మందమర్రి మండలంలోని వెంకటాపుర్ గ్రామ పంచాయతీలో గుడుంబా క్రయవిక్రయాలు అతిగా జరుగుతున్నాయి దానితో రోడ్డున పడుతున్న కుటుంబాలు

గుడుంబా తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు

అంతేకాకుండా యువకులు ఈ గుడుంబాకీ బానిసలు అవుతున్నారు

గుడుంబా తాగి చిన్న వయసులో ప్రాణాలు పోతున్నాయి దానితో కుటుంబ పెద్దదిక్కు భర్తను కోల్పోపోవడం తో ఆ తల్లీ,పిల్లలు రోడ్డున పడుతున్నారు, అంతేకాకుండా ఆ పిల్లల పోషణ తల్లికి భారం అవుతుంది

గుడుంబా తయారీలో అనేక క్రిమిసంహారక,మత్తు పదార్థాలు యూరియా ,అత్యంత ప్రమాదకరమైనటువంటి మందులు వాడి ఈ గుడుంబా తయారు చేస్తున్నారు దానితో గుడుంబా తాగి శరీరంలోని కిడ్నీలు మరియు అవయవాలు పూర్తిస్థాయిలో పాడైపోయి ప్రాణాలు కోల్పోతున్నారు

గత ప్రభుత్వం గుడుంబా తయారీ దారుల మీద పిడియాక్ట్ కేసులు పెట్టడం జరిగింది ఆయన కూడా కొంతమంది ఇప్పుడు ఒక ముఠాగా ఏర్పడి గుడుంబాన్నీ గ్రామాలకి విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు దానితో గ్రామాలలో ప్రజలు యువకులు గుడుంబాకి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు

కావున వెంటనే ఈ గుడుంబా తయారు చేసి గ్రామాలకు సరఫరా చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది

కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాలు సమావేశం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని,సమాచారం మేరకు,మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాం పై 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినట్టు తెలిపారు.ఆ దాడులను ఖండిస్తూ రాజారాం కు ఎలాంటి హాని తలపెట్టిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని అన్నారు.దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై దాడులకు,ప్రతి దాడులకు హిందూ సమాజం సిద్దంగా ఉంది అని, తెలియజేస్తూ ఖబర్దార్ మతోన్మాద శక్తుల్లారా, ఖబర్దార్,అంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి కర్ణ కంటి రవీందర్,రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్ కొట్టినటేశ్వర్,వి హెచ్ పి కోశాధికారి బైరి విష్ణు దాస్,సందేశ్గుప్తా,శివాజీ సేన ఉదేయ్,శ్రీకాంత్,సంతోష్,బద్రి నారాయణ,వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం తీగల్ పహాడ్ లోని జాగృతి కార్యకర్తలు కందుల ప్రశాంత్, నస్పూర్ తోళ్లవాగు సమీపంలోని శశి ఇళ్లకు వెళ్లారు.గౌతమి నగర్ లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుం బాన్ని పరామర్శించారు.అదేవిధంగా లక్షేట్ పెట్,పట్టణములో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా,ఇంటికి వెళ్లడం జరిగింది.ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవితతో పాటు తన అనుచరులు కూడా ఉన్నారు.

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా.

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగులు

మంచిర్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద మే 15 నుండి నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో పారిశుధ్య కార్యక్రమాలను మంచిర్యాల జిల్లా పంచాయితి రాజ్ ఉద్యోగులు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పంచాయితీ అధికారి డి.వేంకటేశ్వర రావు మాట్లాడుతూ..పుష్కరాలకు అశేష భక్తులు హాజరు అవుతున్నందువలన అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులతో తడి చెత్త,పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరుగుతుందని,ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంతోపాటు అవసరం ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుందని,మండల పంచాయితీ అధికారులతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర రావు,మండల పంచాయతీ అధికారులు సఫ్తర్ అలీ, ఇంచార్జీ డి ఎల్ పి ఓ,శ్రీపతి బాపు రావు ఎంపీఓ జైపూర్,సత్యనారాయణ, ఎంపీఓ మందమర్రి,అజ్మత్ అలీ ఎంపీఓ చెన్నూరు, బి.శ్రీనివాస్ ఎంపీఓ బెల్లంపల్లి, జి.అనిల్ కుమార్ ఎంపీఓ తాండూర్,ప్రసాద్ ఎంపీఓ దండేపల్లి తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల బంద్ విజయవంతం.

మంచిర్యాల బంద్ విజయవంతం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రమూకలు హిందువులపై దాడి చేసి 25 మందిని కిరాతకంగా చంపేసిన దుశ్చర్యను నిరసిస్తూ శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక మంచిర్యాల బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది.పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అంటూ బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం చేశారు.హిందూ సంఘాలకు ఐక్య వేదిక అధ్యక్షులు కార్యదర్శి,డేగ రవింద్, కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ హిందువులంతా ఏకమై గర్జించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉగ్రవాదం పై ఒక పాదం మోపి సమూలంగా పాతలానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని కోరారు.బందుకు మరియు బైక్ ర్యాలీకి సహకరించి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు,కుల సంఘాలకు,వ్యాపారస్తులకు, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version