వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన

వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన

 

 

 మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను ఇవాళ(శుక్రవారం) విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి మాతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబరు 27వ తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version