మైపతి అరుణ్ కుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన…

మైపతి అరుణ్ కుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన

తుడుం దెబ్బ రాష్ట్ర కోశాధికారి కల్తి రాంప్రసాద్

ఖమ్మం జిల్లా తుడుందెబ్బ అధ్యక్షులు బచ్చలి వెంకటేశ్వర్లు.

కారేపల్లి నేటిధాత్రి

 

 

 

22-03-2026 ఈరోజు తుడుం దెబ్బ రాష్ట్ర- జిల్లా కమిటీ నిర్మాణాల లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక కోసం బయలుదేరిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మైపతిఅరుణ్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని ఖమ్మం జిల్లా తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. విడుదల చేయకుంటే ఏజెన్సీ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.
ఏజెన్సీలో ఆదివాసులు స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునే హక్కు కూడా లేదా అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఆదివాసీలపై చేస్తున్న దౌర్జన్యాన్ని తుడుం దెబ్బ చూస్తూ ఊరుకోదని త్వరలోనే దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version