వ్యవసాయ ఒక ఉద్యోగం లాంటిది.

వ్యవసాయ ఒక ఉద్యోగం లాంటిది.

పంటల మార్పిడితో అధిక లాభాలు..

వరిపంట సాగు కంటే కంది పంటతో అధిక లాభాలు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంది విత్తనాల కిట్ల పంపిణి

నర్సంపేట నేటిధాత్రి:

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రిక పద్దతిలో వ్యవసాయం చేస్తేనే లాభాలు లేకపోతే అప్పులపాలు కాక తప్పదని అన్నారు. వ్యవసాయం చేసే రైతులకు అది ఒక ఉద్యోగం లాంటిదని, సేంద్రియ వ్యవసాయంతో కష్టపడి పని చేస్తే లాభాలు పొందవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.జాతీయ ఆహార భద్రత పోష కమిషన్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పప్పు దినుసుల చిరు సంచుల కందులు,మినుములు విత్తన పంపిణీ కార్యక్రమం నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల లో గల రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎల్అర్జి 52 రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంది పంట సాగు చేయడం ద్వారా అధిక లాభాలు రావడం,ఆకులు మొత్తం భూమిపై రాలడంతో ఎరువులగా మారుతుంది. దీంతో భూసారం పెరుగుతుంది.రాబోయే పంటలకు ఎరువులు తక్కువగా వాడుకోవచ్చని పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్న విధంగా కందులు 10 నుండి 12 క్వింటాలు రావడం ఖాయమని ,వరి సాగు కంటే కందుల పంట సాగు వలన అధిక లాభాలు పొందవచ్చన్నారు.పత్తి మిరప,వేరుశనగ మరే ఇతర పంటల కంటే పప్పు దినుసుల పంటలే మేలన్నారు.గతంలో పశువుల ఎరువులు వాడేది.

ఇప్పుడు అధికంగా కెమికల్స్, ఫర్టీలైజర్స్ వేస్తున్నారు. దీంతో భూసారం తగ్గుతున్నది.పెట్టుబడులు పెరుగుతున్నాయి.లాభాలు తక్కువగా వస్తున్నాయని దీంతో రైతు కుటుంబం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని ఎమ్మెల్యే దొంతి రైతులకు సూచించారు.అధిక పెట్టుబడుల వలన నేడు రైతులు తమ శ్రమ శక్తిని కూడా సంపాదించలేక పోతున్నారని…రైతే రాజు.. నేను రాజు అనే పిలింగ్ తో ,వ్యవసాయంలోనే ఉపాధి.. ఉన్నది.వ్యవసాయంతోనే జీవనం సాగిస్తూ అభివృద్ధి చేసుకోవాలని ఈసందర్భంగా పేర్కొన్నారు.తక్కువ పెట్టుబడులు ఉన్న అపరాలు పంటలు,ఫామ్ అయిల్ పంటలు సాగు చేసుకోవాలన్నారు.బయట దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులకు ఆపాలని,వేరుశనగ,అపరాల పంటలకు బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదికలు అందించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దొంతి రైతులకు తెలిపారు.గ్రామాల్లో ఇండ్ల కూరగాయలు, కోళ్ళు,గుర్రెలు పెంపకం చేసుకోవాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ సాగు చేసుకోవటం లేదు.
గ్రామాల్లో ఉన్న ప్రజలకు హైదారాబాద్ లో ఉన్న ప్రజలకు తేడా లేకుండా పోయిందని ఈ సందర్భంగా నియోజక వర్గం ప్రజలకు సూచించారు.
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధ మాట్లాడుతూ
ప్రతీ రోజు పప్పుదినుసులు తినాల్సిందే. కావున ప్రస్తుతం పప్పుల్లో కలర్ వేస్తున్నారు.వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పప్పు దినుసుల పంటలు
వరి సాగు కంటే కందుల పంట వలన అధిక లాభాలు ఉన్నాయని సూచించారు.ఈ సాగు వలన భూసారం పెరుగుతుంది.అవసరం మేరకే ఎరువులు,కెమికల్స్ వేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్టీవో ఉమారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జాతీయ ఆహార భద్రత న్యూట్రిషన్ మిషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కన్సల్టెంట్ సారంగం,వైస్ చైర్మన్ , ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు మాటలకే పరిమితమా సింగరేణిలో కాంట్రాక్టు అంటే ఎగిరి గంతేస్తున్న బడా కాంట్రాక్టర్లు ? 8 రాష్ట్రాలలో అమలైనా హై పవర్ కమిటీ వేతనాలు మన తెలంగాణ రాష్ట్రం సింగరేణి బొగ్గు బావిలో ఎందుకు అమలు కాలేదు ఎవరిది వివక్షత సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు పెరిగితే జీర్ణించుకోలేకపోయే అప్పుడున్న పెద్దలు ఎవరు ఐ పవర్ కమిటీ వేతనాలలో సంతకాలు ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు కట్టు బానిసల వల్లే పని చేయాలని అర్థమా
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మా శ్రమ మా కష్టం కడుపు మార్చుకో నీ పని చేస్తేనే దేశానికి వెలుగులు సింగరేణి పర్మనెంట్ కార్మికులకు తో సమానంగా పనిచేస్తున్న కానీ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనం లేక హరి గౌస పడుతున్న విషయాన్ని సింగరేణి యాజమాన్యానికి తెలియదా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికుల ఓటు బ్యాంక్ తో చెలగాటలాడుతున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు పర్మినెంట్ కార్మిక సంఘాలు స్టేజీల మీద మాటలకే పరిమితం అవుతున్నాయి వేజ్ బోర్డు సమావేశాలలో ఏ ఒక్కరోజు కూడా కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయించలేని దుస్థితిలో ఈరోజు మనము ఉన్నామంటే సిగ్గుచేటు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కానీ ఈరోజు కూడా మాటలకే పరిమితం అవుతున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అని కార్మికులు గుసగుసలాడుతున్నారు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థని కట్టు బానిసలుగా మార్చే దిశగా పయనిస్తున్న ఆశ్చర్యపడేది లేదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలు ఈరోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సింగరేణి బొగ్గు బావుల్లో పదకొండు డివిజన్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఎదురుచూపు కె పరిమితం తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు సకల జనుల సమ్మెలో ప్రతి బొగ్గు బై పైన 11 డివిజన్లలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడి సకల జనుల సమ్మెలో 42 రోజుల సమ్మెను కాంట్రాక్టు కార్మికులు జీతం లేకుండా కుటుంబాలను ఆకలితో మార్చి సమ్మెలో విజయవంతం చేసిన ఘనత సింగరేణి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులది కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిపై కూర్చొని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల లేరు అని నిండు అసెంబ్లీలో చెప్పి అవమానపరిచి కార్మికుల గొంతు కోశారు.నిజం కాదా
టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొట్టుకపోయి మార్పు జరగాలని ప్రజలు నిర్ణయాన్ని సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఏకతాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత చరిత్ర సింగరేణి ప్రాంత బిడ్డలది కాదని ఈరోజు అడుగుచున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు 11 రివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని మాట్లాడి ఒక తాటిపైన ఉండి సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 22 జీవో.ఐ పవర్ వేతనాలు ఇప్పించే దిశగా మీరు ముందుండి కార్మికులకు అండగా ఉంటారని గడిచిన సంవత్సరం నెలలో రామగుండం ఎమ్మెల్యే ఒక్కడు రెండుసార్లు మాట్లాడడం జరిగింది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆశతో ఉన్నారు వారికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయి వారికి కచ్చితంగా మనము ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని.22వ జీవో అమలు చేయాలని చెప్పడం సంతోషకరమైన విషయం కానీ అదే పది డివిజన్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆరోజు ప్రస్తావించి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియజేసి ఉంటే ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు ఇంత అంత మేలు జరిగేది కూల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈరోజు తెలియజేస్తున్నాం కార్మికుల పక్షాన విన్నమిస్తున్నాము అర్ధిస్తున్నాము వేడుకుంటున్నాము సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకు జీతాలు పెంచే దిశగా మీరు అడుగులు వేయాలని మీ వెనకాల మేము ఉంటామని కాంగ్రెస్ పెద్దలకు మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version