రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ..

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రోను రద్దు చేసి.. రేవంత్‌రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై కాంగ్రెస్ నేతలు దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట సమతా కాలనీలో కేటీఆర్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version