ఏఐఎంఐఎం పార్టీ తరపున అవకాశం కల్పించినందుకు అధిష్టాననికి కృతజ్ఞతలు…

ఏఐఎంఐఎం పార్టీ తరపున అవకాశం కల్పించినందుకు అధిష్టాననికి కృతజ్ఞతలు

◆- : షైక్ ఇలియాస్ కౌన్సిలర్ అభ్యర్థి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ జనవరి 30: మున్సిపాల్ ఎన్నికలల్లో భాగంగా జహీరాబాద్ మున్సిపాలిటీ 22 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గా ఏఐఎంఐఎం పార్టీ తరపున ఫారమ్ బి ఫామ్ ఇచ్చి,ఎలక్షన్ లో పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు 22 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షైక్ ఇలియాస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధిష్టాననికి జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్ లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతు… నామినేషన్ కొరకు బి ఫామ్ ను ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, నాయకులు అక్బరుద్దీన్ ఒవైసీ కార్వాన్ ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా బాద్యులు కౌసర్ మొహియుద్దీన్, జహీరాబాద్ అధ్యక్షుడు అథర్ లకు ఎప్పుడు కృతజ్ఞతుడిగా ఉంటు నా పై నమ్మకంతో ఉంచి అవకాశం కల్పించినందుకు ప్రజల మద్దత్తు తో కచ్చితంగా గెలిచి ప్రజలకు సేవా చేస్తానని దిమా వ్యక్తం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను అభ్యర్థించారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్..

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్

 

ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్పుకొచ్చింది.

ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ (Telangana IPS Officers Association) పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్పుకొచ్చింది. కరీంనగర్ సీపీ గౌశ్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేశారని అసోసియేషన్ మండిపడింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version