క్యాతన్ పల్లి 15 వ వార్డ్ లో బాల్క ఆధ్వర్యంలో బారాస లో చేరికలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరిపాలిస్తున్న నియోజకవర్గంలో నీ క్యాతన్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని 15 వ వార్డ్ లో బారాస పార్టీ లో భారీ చేరికలు జరిగాయి. స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఆర్నె సతీష్ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకుడు సిరిమల్లె సుధాకర్ తన అనుచరులతో పార్టీలో చేరారు. స్థానిక నాయకురాలు చంద్రకళ తన అనుచరులతో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .రానున్న రోజుల్లో మునిసిపాలిటీ పీఠాన్ని భారాస పార్టీ కైవసం చేసుకుంటుందని, అందుకు తగిన కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. పార్టీ కోసం కృషిచేసి మునిసిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాల్క సుమన్ నాయకులకు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మేడిపల్లి సంపత్, మాజీ కౌన్సిలర్లు,నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
