మహాత్మ జ్యోతి భా పులే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు…

మహాత్మ జ్యోతి భా పులే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

నేటి ధాత్రి యాదాద్రి:

 

ఈ నెల 11 న జరుగబోయే మహాత్మ జ్యోతి భా పులే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని (చాళుక్య రాఘవేంద్ర) హోటల్లో పూలే జయంతి ఉత్సవాల కమిటీ నీ అన్ని పార్టీల, కుల సంఘాల, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించటం జరిగింది.

జ్యోతి భా పులే జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలు గా పట్టణ మున్సిపల్ “చైర్ పర్సన్” శ్రీ మతి “తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్” గారిని, గౌరవ సలహాదారులుగా, పొత్నక్ ప్రమోద్ కుమార్, అతికం లక్ష్మి నారాయణ గౌడ్,పెంట నరసింహ, సుర్వీ శ్రీనివాస్ గౌడ్, గొట్టిపముల బాబురావు,
మాటూరి అశోక్, కొత్త బాలరాజు, మాటూరి బాలేశ్వర్.
కన్వీనర్: కొత్త నరసింహ స్వామి, కో కన్వీనర్లుగా దేవరకొండ నర్సింహ చారి, దరిపల్లి ప్రవీణ్ కుమార్, పంచేద్దుల బల్ రామ్, పిట్టల బాలరాజు, సబంకర్ వెంకటేష్, బెండ శ్రీకాంత్, సిరికొండ శివకుమార్, యేషాల అశోక్, మాయ కృష్ణ, జిన్న మల్లేష్, కూర శివ కుమార్, రత్న పురం పద్మ , సిద్ధుల పద్మ,లను నియమిచకోవటం జరిగింది. ఇట్టి సమావేశంలో అన్ని కుల సంఘాలు,
అన్ని రాజకీయ పార్టీలు, కలిసి పాల్గొని, పూలే ఉత్సవాలను జయప్రదం చేయాలని, జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో జరగబోయే జయంతికి పార్టీలకతీతంగా బీసీ ప్రతినిధులందరూ, బీసీ కుల సంఘాల నాయకులందరూ, బీసీ విద్యార్థులు బీసీ ఉద్యోగులు బిసి మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరింది. ఈ కార్యక్రమంలో వివిధ బిసి కులాలకు చెందిన నాయకులు అన్ని రాజకీయ పార్టీల బిసి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version