నర్సంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహణకు సన్నాహాలు
శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.యువశక్తికి దిశానిర్దేశం చేస్తూ, స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని తెలిపారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఈ మెగా జాబ్ మేళాను ప్రజా ఉద్యమంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.నియోజకవర్గంలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు
