‘వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినిమా రంగంలో రాణింపు’
కల్వకుర్తి / నేటి ధాత్రి.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన బోయిన్ పల్లి శేఖర్ గౌడ్ వ్యవసాయ కుటుంబం. శ్రీశైలం హైవేలో కొంతకాలం హోటల్ నిర్వాకుడిగా పనిచేశాడు. అనంతరం అంది వచ్చిన అవకాశంతో.. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్ గా మిత్రుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి పనిచేశారు. ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలయ్యింది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, సినిమా రంగంలో రాణించడంతో బంధువులు, స్నేహితులు శేఖర్ గౌడ్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.